KL Rahul Indian Team T20 Captain |T20I Series | IND VS NZ || Oneindia Telugu

2021-11-02 23,951

ICC T20 World cup 2021: Indian opener KL Rahul is expected to lead the Men in Blue in the upcoming T20I series against New Zealand with several senior players opting for rest following a hectic schedule.
#ICCT20Worldcup2021
#INDVSNZT20Series
#KLRahulT20Captain
#IPL
#INDVSAFG
#IPL2022megaauction
#Viratkohli


టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి పలువురు సీనియర్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. దాంతో టీమ్‌ను కేఎల్ రాహుల్ నడిపిస్తాడని చెప్పాడు. ఇక ఈ సిరీస్‌ ప్రేక్షకుల మధ్యే జరుగుతుందని, పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని చెప్పాడు. ఇప్పటికే ఆ దిశగా కార్యచరణ మొదలు పెట్టామని, స్థానిక అధికారులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించాడు.